నగరం వైపు దూసుకొస్తున్న మేఘాలు.. మరికాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

by Malleboina Mahesh |

రాబోయే 2 గంటల్లో గోల్కొండ, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్‌పల్లి, గాజులరామారం, నేరేడ్‌మెట్, దమ్మాయిగూడలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

నగరం వైపు దూసుకొస్తున్న మేఘాలు.. మరికాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా దంచికొట్టిన వర్షాలు (rains) ఈరోజు కాస్త విరామం ఇచ్చాయి. ముఖ్యంగా మహా నగరం హైదరాబాద్ (Hyderabad) మేఘావృతం (cloudy) అయినప్పటికీ ఎటువంటి వర్షం కురవలేదు. కానీ తాజాగా.. నగరం వైపు నల్లటి దట్టమైన మేఘాలు (Dark thick clouds) దూసుకు వస్తున్నాయి. రాబోయే 2 గంటల్లో గోల్కొండ, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్‌పల్లి, గాజులరామారం, నేరేడ్‌మెట్, దమ్మాయిగూడలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) అంచనా వేసింది. అలాగే మరో స్పెల్‌లో పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు విస్తరించి ఉండటం తో రాత్రి మధ్య తెలంగాణలో వర్షాలు చురుకుగా కురుస్తున్నాయని, ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి (నారాయణఖేడ్), నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, యాదాద్రి - భువనగిరి అంతటా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Next Story