రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు

by Yella Dhawani Reddy |

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొడుతుంది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో బాధపడుతున్న ప్రజలకు ఇది స్వల్ప ఉపశమనం కలిగించింది.

అలాగే రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Next Story