రాష్ట్రంలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-09 17:18:30  IST  )

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 7 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకి వెళ్లాలని సూచిస్తున్నారు.

Next Story