- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాగల మూడు రోజులు వర్షాలు
రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది.

రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, ఒకవైపు వడగాలులు
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో 11 సెం.మీ లవర్షం
రాష్ట్రంలో 9 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిస్తుంటే, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో కురిసిన ఈ అకాల వర్షాల్లో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో 11 సెం.మీ ల భారీ వర్షం నమోదైంది. ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతుంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాగల మూడు రోజులు వర్షాలు
అలాగే రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది. బుధవారం సంగారెడ్డి జిల్లా హథ్నూరలో 11 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా కోయికొండలో 11 సెం.మీ, నారాయణ పేట్ జిల్లా నర్వలో 9 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 9 సెం.మీ, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో 8 సెం.మీ, కల్వకుర్తిలో8 సెం.మీ, నారాయణ్ పేట్ జిల్లా మద్దూర్ లో 8సెం.మీ, సంగారెడ్డి జిల్లా నేకల్ లో 7 సెం.మీ, వనపర్తి జిల్లా వీపగండ్లలో 6 సెం.మీ, కామారెడ్డి జిల్లా దోమకొండలో 6 సెం.మీ, మోజెర్లలో 6 సెం.మీ, నారాయణ పేట జిల్లా దామరగిద్దలో 6 సెం.మీ, కామారెడ్డి జిల్లా మచ్చారెడ్డిలో 6 సెం.మీ, మెదక్ జిల్లా నర్సాపూర్ లో 6సెం.మీ, సిద్దిపేట్ జిల్లా కొండపాకలో 5 సెం.మీ, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 5 సెం.మీ చొప్పున వర్షాలు కురిశాయి.






