- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వానల వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరదలో మునిగిపోగా.. కామారెడ్డిలో రైలు పట్టాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. రెండు జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.






