- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఐదు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. చాలా గ్రామాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డిలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర జిల్లాల్లోనూ చాలా ప్రాంతాల్లో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఐదు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగితా జిల్లాలలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.






