- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: భారీ వర్ష సూచన.. అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి హై అలెర్ట్
ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అవసరమైతే ముందుగానే ప్రజలను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలను తరలించాలని సూచించింది. అన్ని కాజ్ వేలను పరిశీలించి రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యాసంస్థలు కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం కురిసే సమయంలో అనవసరంగా జనం రోడ్లపైకి రావొద్దని సూచించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి.






