- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో మూడు రోజులు భారీ వర్షాలు
రాగల మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాగల మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ కు రిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ తెలంగాణలో అత్యధిక వర్షాపాతం:
గురువారం రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాపాతం నమోదైంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ లో అత్యధిక వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేట్ లో 9 సెం.మీ, జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజాలో 7 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ 7 సెం.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో 7 సెం.మీ, జోగులాంబ గద్వాల్ జిల్లా మడ్కల్ 6 సెం.మీ, గట్టు 6 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్బన్ 6 సెం.మీ, బాలా నగర్ లో 6 సెం.మీ, హన్వాడ లో 5 సెం.మీ, నిర్మల్ జిల్లా భైంసా 6 సెం.మీ, జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో 5 సెం.మీ, చొప్పున వర్షాపాతం నమోదైంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు:
ప్రాంతం నమోదైన ఉష్ణోగ్రత(డిగ్రీ సెల్సియస్ లలో)
ఆదిలాబాద్ -33.8
భద్రాచలం -33.2
హకీంపేట్ -33.1
దుండిగల్ -32.2
హన్మకొండ -31.5
హైదరాబాద్ -33.4
ఖమ్మం -33.4
మహబూబ్ నగర్ -30.2
మెదక్ -30.8
నల్గొండ -36
నిజామాబాద్ -31.4
రామగుండం -33
- Tags
- Telangana Rains






