Telangana Weather: ఉపరితల ఆవర్తనం.. తెలంగాణకు భారీ వర్షసూచన

by Naga Rani Yarlagadda |

కర్ణాటక తీరానికి సమీపంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, నాలుగైదు రోజుల్లో అవి కేరళ (Kerala Rains) తీరానికి రానున్న క్రమంలో పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన చేసింది.

Telangana Weather: ఉపరితల ఆవర్తనం.. తెలంగాణకు భారీ వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక తీరానికి సమీపంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, నాలుగైదు రోజుల్లో అవి కేరళ (Kerala Rains) తీరానికి రానున్న క్రమంలో పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన చేసింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

హైదరాబాద్ సహా.. మధ్య తెలంగాణలో జల్లులు, కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం (Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనం (Low Pressure)గా మారి.. 22నాటికి ఉత్తరాంధ్ర తీరాన్ని చేరుతుందని, 23వ తేదీకి ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Next Story