అలర్ట్.. తెలంగాణకు రేపు, ఎల్లుండి భారీ వర్షసూచన

by Naga Rani Yarlagadda |

అధిక ఎండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, వాన కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు వాతావరణశాఖ కూల్ న్యూ్స్ చెప్పింది.

అలర్ట్.. తెలంగాణకు రేపు, ఎల్లుండి భారీ వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక ఎండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, వాన కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు వాతావరణశాఖ కూల్ న్యూ్స్ చెప్పింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్ల కింద నిలబడవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

Next Story