- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడిసిముద్దైన భాగ్యనగరం.. ఏ ఏరియాలో ఎంత వర్షపాతమంటే..
హైదరాబాద్ లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకూ.. సుమారు 3 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకూ.. సుమారు 3 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ఇళ్లకు చేరుకునేందుకు గంటల సమయం పట్టింది. లోతట్టు ప్రాంతాలతో పాటు.. ప్రధాన రహదారులు కూడా నీట మునిగాయి. నగరంలో అత్యధికంగా మారేడ్ పల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. మారేడ్ పల్లి, బాలానగర్, బండ్లగూడ, ముషీరాబాద్ ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బోయిన్ పల్లిలో 11.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
నాచారంలో 10.05, ఉప్పల్ - 10, మల్కాజ్ గిరి -10, మూసారాంబాగ్ - 9.8, మల్కాజ్ గిరి అడ్డగుంట - 9.7, బండ్లగూడ - 9.53, ఓయూ - 8.95, కుత్బుల్లాపూర్ -8.25, బార్కాస్ 8.55, కందికల్ గేట్ -8.55, అంబర్ పేట -8.45, ఫూల్ బాగ్ - 8.15, జవహర్ నగర్ -8, బతుకమ్మకుంట -7.93, ఆనంద్ బాగ్ - 7.8, విద్యానగర్ -7.8, భోలక్ పూర్ - 7.8, మెట్టుగూడ -7.78, మాదాపూర్ - 7.58, కూకట్ పల్లిలో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.






