- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు ప్రజలకు అలర్ట్.. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు!
శ్రీకాకుళం, బాపట్ల, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఎండాకాలంలో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు, ఈ సారి కాస్త ముందుగానే పడ్డాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు వర్ష ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. అంతేకాదు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు.
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, బాపట్ల, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడ్డ సమయంలో బయట జనాలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇది ఇలా ఉండగా కొన్ని జిల్లాల్లో ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతుంటే... మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీలు దాటిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరం శాఖ సూచనలు చేస్తోంది.






