రాబోయే 2 గంటలు జాగ్రత్త.. ఈ 8 జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండగ శోభ కనుమరుగైంది.

రాబోయే 2 గంటలు జాగ్రత్త.. ఈ 8 జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండగ శోభ కనుమరుగైంది. రోడ్లన్నీ జలమయమవ్వడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.

హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Next Story