హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. అప్రమత్తమైన హైడ్రా, జీహెచ్ఎంసీ

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లో భారీ వర్షం (Heavy Rain) బీభత్సం సృష్టిస్తోంది.

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. అప్రమత్తమైన హైడ్రా, జీహెచ్ఎంసీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో భారీ వర్షం (Heavy Rain) బీభత్సం సృష్టిస్తోంది. సుమారు సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మొదలైన భారీవర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రెండుగంటలుగా ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చినుకు పడితే చాలు.. ట్రాఫిక్ స్తంభించిపోయే మహానగరంలో.. భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (Hyderabad Traffic) ఏర్పడింది.

ఉప్పల్, రామంతాపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ, అమీర్ పేట్, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, హకీంపేట్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా.. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల నాలాలు పొంగిపొర్లుతుండటంతో జీహెచ్ఎంసీ (GHMC), హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (Hydra Monsoon Emergency Team) అప్రమత్తమయ్యాయి. భారీవర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. మరోవైపు రాజ్ భవన్ వద్ద భారీగా వర్షపునీరు నిలవడంతో ఎమర్జెన్సీ టీమ్ రంగంలోకి దిగి వర్షపునీటిని నాలాల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తోంది. బంజారాహిల్స్ లో భారీ వర్షానికి ఓ కారుపై చెట్టు కూలడంతో సహాయక చర్యలు చేపట్టింది.

Next Story