- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి భారీ వాన బీభత్సం.. తడిసి ముద్దయిన ధాన్యం, అన్నదాతల కన్నీరు
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. నష్టపోయిన తమను పరిహారంతో ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పలు జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు నిన్న రాత్రి కురిసిన వర్షం కాస్త ఉపశమనం ఇచ్చినప్పటికీ రైతన్నలకు మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి కొనుగోలు కేంద్రాలు (ఐకేపీ సెంటర్లు), మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన వరి, మక్క ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేక నిస్సాహయ స్థితిలో అన్నదాతలు ఉండిపోవాల్సి వచ్చింది.
పరిహారం ఇవ్వాలని డిమాండ్:
జగిత్యాల జిల్లా మెట్‍పల్లి వ్యవసాయ మార్కెట్‍లో ఆరబోసిన వడ్లు, మక్కలు నిన్నటి వర్షానికి తడిసిపోయాయి. పెద్దపల్లి మార్కెట్ యార్డులో ధాన్యం కొట్టుకుపోయింది. తూకానికి సిద్ధంగా ఉన్న మక్కల బస్తాల్లోకి వర్షంపు నీరు చేరింది. దీంతో తడిసిన ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం వల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.






