- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Metro: హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం.. మెట్రోకు ఫుల్ డిమాండ్
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షంతో మెట్రోకు ఫుల్ డిమాండ్ పెరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Heavy Rains) దంచికొడుతోంది. కూకట్ పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, ప్రగతి నగర్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, యూసఫ్ గూడ్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపైకి వర్షం నీరు వచ్చి చేరింది. ఆఫీసులు వదిలే సమయంలో భారీ వర్షం కురవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమైంది. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షం కారణంగా మెట్రోకు (Hyderabad Metro) డిమాండ్ పెరిగింది. ప్రయాణికులు మెట్రోకు పోటెత్తారు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్లకు తగ్గట్టుగా కోచ్ ల సంఖ్య పెంచాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






