- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆ ప్రాంతాల్లో ఫుల్లుగా ట్రాఫిక్ జామ్
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొడుతోంది. బర్కత్‌పుర, నల్లకుంట, హిమాయత్‌నగర్, కోఠి, నారాయణగూడ, కాచిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అబిడ్స్, ఖైరతాబాద్, దిల్ సుఖ్ నగర్, యూసఫ్ గూడ, బోరబండ తదితర ప్రాంతాలల్లో వర్షం పడుతోంది. వర్షం కారణంగా పలుచోట్ల వరదనీరు రోడ్లపైకి చేరింది. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇదిలావుండగా, ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుడడంతో హైదరాబాద్‌తో పాటూ తెలంగాణలోని జిల్లా్ల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ 10 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని పేర్కొంది. దీంతో పాటూ తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.






