- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొడుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story






