రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, అనకట్టలు, కాల్వలతో పాటు చేరువులపై నిఘా పెంచాలని తెలిపారు. విపత్తు సూచనలు కనిపిస్తే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని అన్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితిలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సహా అన్ని విభాగాల అధికారులతో నీటి పారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం కావాలని మంత్రి ఉత్తమ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్, ఈఎన్‌సీ అంజద్ హుస్సేన్‌లతో పాటు ఆయా జిల్లాల సీఈలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

Next Story