- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష(Heavy Rain) సూచన ఉన్నట్లు పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో అతి భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తిలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. సమన్వయంతోపనిచేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.






