రానున్న 2 గంటల్లో వర్షాలు...ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్

by velandi.Saikiran |

తెలంగాణలోని పలు జిల్లాలలో రానున్న రెండు గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం కీలక ప్రకటన చేసింది.

రానున్న 2 గంటల్లో వర్షాలు...ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరి కాసేపట్లోనే భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో రానున్న రెండు గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జ‌గిత్యాల‌ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇప్పటికే ఈ ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో కుండ పోత వర్షం పడుతోంది.

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఏపీలో వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు కూడా అంచనా వేసింది. చాలా జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రాకూడదని సూచనలు చేసింది అమరావతి వాతావరణ శాఖ కేంద్రం.

Next Story