తెలంగాణకు మరోసారి వాన గండం..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-02 03:47:56  IST  )

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు కొత్తగూడెం, జగిత్యాల, హన్మకొండ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిర్మల్, ములుగు, నిజామాబాద్

తెలంగాణకు మరోసారి వాన గండం..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు కొత్తగూడెం, జగిత్యాల, హన్మకొండ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిర్మల్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అంతే కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, భువనగిరి, కామారెడ్డి, మంచిర్యాల, జనగాం, సూర్యాపేట, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నదులు, జలాశయాలు నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదల కారణంగా ఎక్కవ నష్టం జరిగింది. ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి భారీ వర్షసూచన ప్రకటించడం ముంపుప్రాంతాలకు ఆందోళనకరంగా మారింది.

Next Story