తెలంగాణకు అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో ఎర్ర‌ని ఎండ‌ల‌తో ప్రజ‌లకు చెమ‌టలు ప‌డుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప‌గ‌టిపూట ఊష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతున్నాయి.

తెలంగాణకు అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో ఎర్ర‌ని ఎండ‌ల‌తో ప్రజ‌లకు చెమ‌టలు ప‌డుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప‌గ‌టిపూట ఊష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతున్నాయి. ఈ ఎండ‌ల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా అప్పుడప్పుడూ వ‌ర్షాలు కూడా ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇక రాబోయే మూడు గంట‌ల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల‌లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ ప్రకటించాడు. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, రంగారెడ్డి, జనగాం, హన్మకొండలో అక్కడక్కడా తీవ్రమైన తుఫానులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్‌లో తీవ్రమైన తుఫానులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొన్నారు.

Next Story