HYD: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

by Gantepaka Srikanth |

హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

heavy rains in telangana for three days
X

heavy rains in telangana for three days 

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో కార్యాలయాల నుండి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని కీలక ప్రాంతాలైన ఐటి కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి), జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి మరియు పాతబస్తీ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

రోడ్లపైకి వరద నీరు..

డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా రోడ్లపైన నీరు నిలవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా పంజాగుట్ట, హైటెక్ సిటీ ఫ్లైఓవర్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరిస్థితిని సమీక్షించిన జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటిని తొలగించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు రంగంలోకి దిగాయి. మ్యాన్‌హోల్స్ వద్ద సిబ్బందిని నియమించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూస్తున్నారు.

Next Story