భాగ్యనగరాన్ని కమ్మేసిన పొగమంచు

by Ajay Maddhiboyina |

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక చలి తీవ్రత కేవలం జిల్లాల్లోనే కాకుండా హైదరాబాద్ లోను ఎక్కువే కనిపిస్తుంది.

భాగ్యనగరాన్ని కమ్మేసిన పొగమంచు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక చలి తీవ్రత కేవలం జిల్లాల్లోనే కాకుండా హైదరాబాద్ లోను ఎక్కువే కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో చలికి ప్రజలు వనికిపోతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు భాగ్యనగరాన్ని పొగమంచు కమ్మేస్తోంది. ఎక్కువగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర హైవేలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా చోట్ల రోడ్డుపై ముందుగా వెళుతున్న వాహనాలు కనిపించడంలేదు. ఉదయం 9గంటలు దాటినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక రాబోయే రెండు మూడు రోజులు చలి తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Next Story