జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 23 గేట్ల నుంచి నీటి విడుదల

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు వరద తాకిడి పెరిగింది.

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 23 గేట్ల నుంచి నీటి విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు వరద తాకిడి పెరిగింది. దీంతో ప్రాజెక్టు అధికారులు 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,14,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,21,904 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.300 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలకు సైతం వరద తాకిడి పెరిగింది. ఉస్మాన్ సాగర్ (Osman Sagar Reservoir) ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులుగా ఉండగా.. హిమాయత్ సాగర్ (Himayat Sagar Reservoir) ఇన్ ఫ్లో 1300 క్యూసెక్కులుగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project)కు సైతం వరద పెరిగింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,52,788 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 67,617 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులుగా ఉంది.

Next Story