- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టులో ఉండగానే గుండెపోటు.. ప్రముఖ న్యాయవాది మృతి!
న్యాయమూర్తికి కోర్టులో ఉండగానే హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రముఖ అడ్వకేట్, మాజీ స్పెషల్ జీపీ పర్సా అనంత నాగేశ్వరరావుకు కోర్టులో ఉండగా గుండె పోటు రావడంతో ఆయన మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించినవారు సైతం ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరణిస్తున్నారు. తాజాగా న్యాయమూర్తికి కోర్టులో ఉండగానే హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రముఖ అడ్వకేట్, మాజీ స్పెషల్ జీపీ పర్సా అనంత నాగేశ్వరరావుకు కోర్టులో ఉండగా గుండె పోటు రావడంతో ఆయన మరణించారు.
కిందపడిన వెంటనే తోటి న్యాయవాదులు ఆస్పత్రికి తరలించాగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్దారించారు. నాగేశ్వరరావుది ఖమ్మం జిల్లాలోని కారేపల్లి గ్రామం కాగా విధుల్లో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదం నిండుకుంది. ఇక కోర్టులో ఆయన కుప్పకూలిన వీడియో సీసీ టీవీలో రికార్డ్ అవ్వగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






