- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం ప్రాజెక్టు.. హైకోర్టులో కేసీఆర్, హరీశ్, స్మిత సబర్వాల్ పిటిషన్లపై విచారణ వాయిదా
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ నివేదిక అంశంలో దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పిటిషనర్లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish), ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal), మాజీ సీఎస్ ఎస్ కె జోషి హైకోర్టులో విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్‌లపై మంగళవారం విచారణ జరిగింది.
కమిషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్‌రెడ్డి అఫిడవిట్ సమర్పించకపోవడంపై క్షమాపణలు కోరారు. కొన్ని వివరాలు సేకరించడంలో ఆలస్యం జరిగిందని, త్వరలోనే సమగ్రమైన కౌంటర్ దాఖలు చేస్తామాని కోర్టుకు తెలిపారు. వాదనలు పరిశీలించిన దర్మాసనం నవంబర్ 12 కి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా ఆదేశించింది.






