- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: కేసీఆర్, హరీశ్ పై ఇప్పుడే చర్యలు వద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
by Prasad Jukanti |
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక (Kaleswaram Commission Report) ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తుకు కమిషన్ తో సంబంధం కోర్టుకు వివరించారు. వాదనలు విన్న కోర్టు.. వెకేషన్ తర్వాత విచారణ చేపడతామని తదుపరి విచారణ అక్టోబర్ 7 కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Next Story






