గ్రూప్‌-1 పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

by Naga Rani Yarlagadda |

TGPSC గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.

గ్రూప్‌-1 పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: TGPSC గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. మంగళవారం టీజీపీఎస్సీతో పాటు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల తరపున వాదనలు ముగియగా.. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రతివాదుల వాదనలను బుధవారం విననుంది. గ్రూప్ -1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. టీజీపీఎస్సీతో పాటు గ్రూప్-1 కు ఎంపికైన కొందరు అభ్యర్థులు కోర్టుల అప్పీల్ పిటషన్లు దాఖలు చేశారు. ఈవాల్యుయేషన్ పాదర్శకంగా జరిగినట్లు టీజీపీఎస్సీ పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికకాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు వేశారని, వాటిపై ఇరుపక్షాల వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎంపిక లిస్టును రద్దు చేసిందన్నారు. కాగా.. టీజీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలోనే పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో తేడాలున్నట్లుగా పలు అనుమానాలకు తావిస్తోందని ప్రతివాదుల తరపు న్యాయవాది సురేందర్ కోర్టుకు తెలిపారు.

Next Story