TG High Court : ‘గ్రూప్‌-1’పై విచారణ వాయిదా

by Prasad Jukanti |   (  Updated:2025-06-11 11:55:38  IST  )

గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని హైకోర్టులో 4 పిటిషన్లు దాఖలయ్యాయి.

TG High Court : ‘గ్రూప్‌-1’పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1పై దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీకి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వాయిదా వేసింది. గ్రూప్-1 (Group-1) మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరిగింది. పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకణంలో అక్రమాలు జరిగాయని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. అయితే గత నెల అభ్యర్థుల పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. పునఃమూల్యాంకనం లేదా మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. దీనికి సమాధానంగా నిపుణులతో మూల్యాంకనం చేయించామని అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని టీజీపీఎస్సీ (TGPSC) తరఫున న్యాయవాది వాదన వినిపించారు. గ్రూప్-1 నియామకాలు ఆలస్యమైతే అభ్యర్థులు నష్టపోతారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్టుకు వివరించింది. దీంతో ధ్రువపత్రాలు పరిశీలించవచ్చని హైకోర్టు ఆదేశించింది. అయితే గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని 4 పిటిషన్లను గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేశారు. ఇవాళ విచారణ సందర్భంగా స్టే వెకేట్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు టీజీపీఎస్సీ, ఇతర లాయర్లు సమయం కోరారు. దీంతో విచారణ ఆలస్యమైతే ఎంపికైన వారికి ఇబ్బందులు ఉంటాయని, వినిపించిన వాదనలే మళ్లీ వినిపించవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి వాదనలు ఈ నెల 30వ తేదీన వింటామని విచారణను వరకు వాయిదా వేసింది.

Next Story