- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC బిల్లుకు గవర్నర్ అనుమతి వచ్చినట్లే.. హైకోర్టులో ఏజీ సుదర్శన్ రెడ్డి
బీసీ రిజర్వేషన్ల (BC Reservation)పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ పున: ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల (BC Reservation)పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ పున: ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున సీజే ధర్మాసనం ఎదుట అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తమ వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయన్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మనం ప్రకారమే సర్వే జరిపామని కోర్టుకు విన్నవించారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా పరిగణించాలని కోరారు. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6 శాతంగా తెలిందని ధర్మాసనానికి తెలిపారు. ఆ సర్వే ఆధారంగానే రిజర్వేషన్లను ప్రభుత్వం ఫిక్స్ చేసిందని పేర్కొన్నారు. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు.. పిటిషనర్లకు రిపోర్టు గురించి ఎందుకు అన్ని ఏజీ వాదనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా బీసీ బిల్లు నెంబర్.4 కాపీని ఆయన కోర్టుకు సమర్పించారు. మార్చి నుంచి గవర్నర్ వద్దే బిల్లు పెండింగ్‌లో ఉందని.. సుప్రీం కోర్టు తీర్పు మేరకు 6 నెలలు గడిచినందున బిల్లుకు గవర్నర్ అనుమతి వచ్చినట్లుగానే తాము భావిస్తున్నామని, దీనిపై ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపిస్తున్నారు. కాగా, కోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.






