- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఇవాళ సుప్రీం కోర్టు (Supreme Court)లో మరోసారి విచారణకు రానుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఇవాళ సుప్రీం కోర్టు (Supreme Court)లో మరోసారి విచారణకు రానుంది. ఈ మేరకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) సిట్ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌తో పాటు ఇంటిరిమ్ ప్రొటెక్షన్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
కాగా, వాదనల సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Tushar Mehta) ఇప్పటికే తన వాదనలు వినిపించారు. నిందితుడు ప్రభాకర్ రావు (Prabhakar Rao) అమెరికాలో ఉండగానే.. ఐఫోన్ (I Phone)తో పాటు అధికారిక ల్యాప్‌టాప్ (Laptop)ను ఫార్మాట్ చేసి డిజిటల్ ఆధారాలను నాశనం చేశారని కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించి ఆధారాలు FSL రిపోర్ట్‌లో తేదీలతో సహా ఉన్నాయని అన్నారు. డెస్ట్రాయ్ చేసిన డేటాను మొత్తం రికవరీ చేశారని తెలిపారు. ఫోన్లు ట్యాపింగ్ చేసిన వారిలో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌ల ఉన్నారని పేర్కొన్నారు. ఆ పరిణామాల నేపథ్యంలోనే ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నిరాకరించిందని తెలిపారు.
కానీ, అప్పటికే ఆయనకు సుప్రీం కోర్టు అరెస్ట్ నుంచి ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చి ఇంటరాగేట్ చేయమని ఆదేశాలు ఇచ్చిందని, ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్‌లో సహకరించాలని స్పష్టం చేసిందన్నారు. కానీ, సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభాకర్ రావు విచారణకు సహరించట్లేదని.. అందుకే అతడికి ఇంటరిమ్ ప్రొటెక్షన్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశామని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వ వాదనపై ప్రభాకర్ రావు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ.. విచారణను నేటికి వాయిదా వేసింది.






