- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తరఫున గెలిచి 10 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ (Congress)లో చేరారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తరఫున గెలిచి 10 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ (Congress)లో చేరారు. ఆ ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఈరోజు మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల (Justice Augustine George Masihla) ద్విసభ్య ధర్మాసనం వాదనలు విన్నది. అసెంబ్లీ సెక్రటరీ (Assembly Secretary) తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు బెంచ్‌కు వినిపించారు.
స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయగా.. జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఇక న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని కామెంట్ చేశారు. ఇదివరకు కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని మర్చిపొవొద్దని అన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టులు శక్తిలేనివి కావు. సుప్రీం కోర్టు నోటీసు తర్వాతే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారన్న బీఆర్ గవాయ్ ఫైర్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం ఫైర్ అయింది. పార్టీ పిరాయింపు కేసుల కోర్టు పరిధిలో ఉండగా.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి ఎలా అసెంబ్లీలో చెబుతారని ప్రశ్నించింది.






