High Court : హైకోర్టులో కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్ల విచారణ వాయిదా

by Muthe.Rajitha |

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

High Court : హైకోర్టులో కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్ల విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ వారు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసు 2024 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు నకిలీ వీడియోలను సృష్టించి ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో KTR, జగదీశ్ రెడ్డిని నిందితులుగా చేర్చారు. అయితే కేటీఆర్, జగదీష్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని వారిద్దరి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. తమ వాదనలు వినిపించేందుకు తీన్మార్ మల్లన్న తరపున న్యాయవాది సమయం అడగటంతో ఈ కేసును జూన్ 27కి వాయిదా వేసింది కోర్టు.

Next Story