High Court: హెచ్ సీఏ బాధ్యతలు మరో మూడు వారాలు రిటైర్డ్ జడ్జికే

by Prasad Jukanti |   (  Updated:2025-07-28 06:51:33  IST  )

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై దాఖలైన పిటిషన్ పై టీజీ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

High Court: హెచ్ సీఏ బాధ్యతలు మరో మూడు వారాలు రిటైర్డ్ జడ్జికే
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) బాధ్యతలు విశ్రాంత న్యాయమూర్తికి అప్పగిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు (TG High Court) మరో మూడు వారాల పాటు పొడిగించింది. హెచ్ సీఏ లో జరిగిన ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ షఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యతర ఉత్తర్వులను మరో మూడు వారాలకు పొడిగించింది. కాగా ఈ నెల 19న జరిగిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించడంతో పాటు హెచ్ సీఏ బాధ్యతలు బీసీసీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని సఫిల్ గూడా క్రికెట్ క్లబ్ హైకోర్టును కోరింది. ఈ పటిషన్ పై గతంలో విచారణ జరిన కోర్టు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల పర్యవేక్షణకోసం రిటైర్డ్ జడ్జి జస్టిస్ నవీన్ రావును నియమించింది. ఆయన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మరో మూడు వారాల వరకు కొనసాగిస్తూ తాజాగా ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Next Story