Ponnam Prabhakar : విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి : పొన్నం ప్రభాకర్

by Muthe.Rajitha |

మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

Ponnam Prabhakar : విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి : పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, ఆహారంలో తప్పనిసరిగా నాణ్యత పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త మెనూను అతి త్వరలో విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఏదైనా స్కూల్లో సమస్యలు ఉంటే వెంటనే సెక్రటరీ ద్వారా ప్రభుత్వానికి ఆ సమస్యలను చెప్పి పరిష్కరించడానికి ప్రతి ప్రిన్సిపల్ కృషి చేయాలన్నారు. విద్యార్థుల కోసం ఇప్పటికే సొంత భవనాలు ఉన్న 21 గురుకుల పాఠశాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

విద్యా, ఆహారం నాణ్యత ప్రమాణాల కోసం మహాత్మ జ్యోతిబాపూలే లో టాస్క్ ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెరిట్ గల విద్యార్థులను అభినందించి వారికి కావలసిన ప్రత్యేక అవసరాలు సెక్రటరీ దృష్టికి తన దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే పదవ తరగతి పరీక్షలలో ఎం జె పి విద్యార్థులు మంచి రిజల్ట్స్ సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలన్నారు. ఎవరైనా స్లో లెర్నర్స్ ఉంటే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిలో విద్య నైపుణ్యాలను పెంచడానికి కృషి చేయాలని, అధికారులు నిర్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఏంజెపి గురుకుల సెక్రటరీ సైదులు, ఆర్సీవోలు, డిసిఓలు మొదలగు అధికారులు పాల్గొన్నారు.

Next Story