మహబూబాబాద్ ఆస్పత్రి ఘటనపై విచారణకు ఆదేశించిన ఆరోగ్యశాఖ మంత్రి

by Ajay Maddhiboyina |

మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో బతికుండగానే వ్యక్తిని మార్చురీలో పెట్టిన సంగతి తెలిసిందే. చిన్నగూడురు మండలం బయ్యారం గ్రామానికి చెందిన డ్రైవర్ రాజు అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి రాగా ఆధార్ కార్డ్ లేదని ట్రీట్మెంట్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు.

మహబూబాబాద్ ఆస్పత్రి ఘటనపై విచారణకు ఆదేశించిన ఆరోగ్యశాఖ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో బతికుండగానే వ్యక్తిని మార్చురీలో పెట్టిన సంగతి తెలిసిందే. చిన్నగూడురు మండలం బయ్యారం గ్రామానికి చెందిన డ్రైవర్ రాజు అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి రాగా ఆధార్ కార్డ్ లేదని ట్రీట్మెంట్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆస్పత్రి ముందే వేచిచూసిన రాజు నీరసంతో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. కాగా అతడు చనిపోయాడని భావించిన సిబ్బంది అనాథశవం అనుకుని మార్చురీలో పెట్టారు. ఉదయం స్వీపర్ మార్చురీ శుభ్రం చేస్తున్న సమయంలో వ్యక్తి బతికే ఉన్నాడని గుర్తించాడు.

సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మరో వార్డుకు అతడిని షిఫ్ట్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వార్త బయటకు రావడంతో ఆస్పత్రిలో పనిచేన్న వైద్యులు, సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త ఆరోగ్యమంత్రి దామోదర రాజనర్సింహ వరకు చేరింది. దీంతో ఆయన జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వేర్వేరు మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీని నియమించారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story