టెక్నాలజీ జోడించి వైద్య సేవలు మెరుగుపర్చాలి.. కొత్తగా వచ్చిన గ్రూప్-1 ఆఫీసర్లకు ఆరోగ్య మంత్రి దిశానిర్దేశం

by Ramesh Naini |

ఆధునికత, టెక్నాలజీ జోడించి వైద్య సేవలు మెరుగుపర్చే దిశగా కొత్తగా వచ్చిన గ్రూప్-1 ఆఫీసర్లు ఆలోచన చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

టెక్నాలజీ జోడించి వైద్య సేవలు మెరుగుపర్చాలి.. కొత్తగా వచ్చిన గ్రూప్-1 ఆఫీసర్లకు ఆరోగ్య మంత్రి దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆధునికత, టెక్నాలజీ జోడించి వైద్య సేవలు మెరుగుపర్చే దిశగా కొత్తగా వచ్చిన గ్రూప్-1 ఆఫీసర్లు ఆలోచన చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించిన గ్రూప్-1 ఆఫీసర్లు గురువారం సెక్రటేరియట్‌లో మంత్రిని కలిశారు. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, అనారోగ్యంతో ఆపదలో ఉన్మ ఎంతోమందికి సేవ చేసే అవకాశం ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉంటుందని మంత్రి వారితో పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు అత్యంత పేద ప్రజలు వస్తుంటారని, వారిని ఆప్యాయంగా ప్రేమగా చూసుకునే బాధ్యత ఈ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా, నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా పని చేయాలని‌ కొత్త ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా హాస్పిటళ్ల పనితీరు, ఆరోగ్య రంగంలో టెక్నాలజీ, గ్రామీణ ప్రాంత ప్రజల చెంతకు స్పెషాలిటీ వైద్య సేవలు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులకు మంత్రి వివరించారు. ఒకప్పటిలా ఇప్పుడు అంటువ్యాధుల సమస్య లేదని, వాటి స్థానంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) సమస్య పెరిగిందని ఈ పరిస్థితిని అవగాహన చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలోనూ డే కేర్ కేన్సర్ సెంటర్స్, ఎన్‌సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఎన్‌సీడీ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

Next Story