- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల, మోడల్ స్కూల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డులు.. టిఎస్ యుటిఎఫ్ హర్షం
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బోధనా సమయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండే విధంగా మార్పు చేస్తూ సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తంచేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బోధనా సమయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండే విధంగా మార్పు చేస్తూ సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తంచేసింది. గత సంవత్సర కాలంగా పలు ప్రాతినిధ్యాలు, ఆందోళనలు చేసిన ఫలితంగా ఇప్పటికే మైనారిటీ గురుకులాల్లో కూడా టైం టేబుల్ మార్పు జరిగిందని, గిరిజన సంక్షేమ, బిసి సంక్షేమ గురుకులాల్లో కూడా పనివేళలు మార్పు చేయాలని కోరుతున్నట్లు పేర్కొంది.
అదే విధంగా టిఎస్ యుటిఎఫ్ పక్షాన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్టు (ఇహెచ్ సిటి) బోర్డు సమావేశం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించిన మేరకు గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులను కూడా ఉద్యోగుల ఆరోగ్య పథకంలో చేర్చి హెల్త్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించినందుకు కూడా టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ హర్షం వ్యక్తంచేశారు.






