- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG govt: ఆ ఊరంతా కిడ్నీ వ్యాధిగ్రస్తులే.. మంత్రి ఆదేశాలతో రంగంలోకి నిమ్స్ డాక్టర్స్
మాల గురజాల గ్రామంలో కిడ్ని వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం హెల్త్ క్యాంపులను నిర్వహిస్తోంది .

దిశ, డైనమిక్ బ్యూరో: కిడ్ని వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాల గురిజాల (Mala Gurajala) గ్రామంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. గ్రామంలో క్రమంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల (Kidney Diseases) సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. గడిచిన ఐదేళ్లలో ఈ గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో 25 మంది చనిపోగా ప్రస్తుతం మరో 40 మంది వరకు ఆ వ్యాధితో బాధపపడుతూ బతుకీడుస్తున్నారు. ఈ దయనీయ పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Minister Damodara Rajanarsimha) స్పందించారు. మంత్రి ఆదేశాలతో తాజాగా ఆ గ్రామంలో నిమ్స్ నుంచి వెళ్లిన స్పెషలిస్టు డాక్టర్ల బృందం మెడికల్ క్యాంప్ (Nims Doctors Health Camps) ఏర్పాటు చేసింది. ఇంటింటికీ తిరిగి, వైద్య పరీక్షల కోసం రక్త, మూత్ర నమూనాలు సేకరింస్తున్నారు. కిడ్నీ, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి అవసమైన మందుకు వైద్య బృందం అందజేస్తోంది. కాగా వ్యవసాయం, కూల పని చేసుకుని జీవించే తమ కుటుంబాలను కిడ్నీ వ్యాధులు చిధ్రం చేస్తున్నాయని వ్యాధి కారణంగా నెలలో ఒకటి, రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతో ఆర్థికంగా కుంగిపోతున్నామని గ్రామస్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది.






