ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం

by Bhanu |

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంజారాహిల్స్

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంజారాహిల్స్ కొమురం భీం భవన్ లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో మంత్రి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరంలో అధునాతన యంత్రాలు , సిబ్బందికి ఇచ్చే మందులు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం జీహెచ్ ఎంసీ శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత పరికరాల కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తో కలిసి మాట్లాడుతూ.. స్వచ్ఛ నగరాల్లో హైదరాబాద్ రాజధాని దేశంలో నంబర్ -1 ఉండడానికి ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. కార్మికులు హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు.

కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు వేతనాలు పెంచే అంశంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. 'ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.. మీ పట్ల సానుకూలంగా ఉన్నాం.'అని చెప్పారు. హైదరాబాద్ లో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని స్లమ్స్ డెవలప్ చేస్తూ అక్కడ నిర్మాణాలు చేపట్టి శానిటేషన్ కార్మికులకు ఇవ్వాలని ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కి పెట్టుబడులు వస్తున్నాయంటే శానిటేషన్ వర్కర్లు అద్దం లెక్క హైదరాబాద్ ను ప్రపంచానికి చూపెడుతున్నారని అభినందించారు.

'అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ఊర్లలో సన్న వడ్ల కి 500 బోనస్ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం అందిస్తున్నాం' అని మంత్రి వివరించారు. అనంతరం మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. శానిటేషన్ సిబ్బంది తరచుగా ఆరోగ్య సమస్యలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం అందజేసిన కిట్స్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలకుండా ముందు నుంచే జాగ్రత్తలు పాటించాలని క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో శానిటేషన్ సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ తమ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.


మొదటిసారిగా బంజారాహిల్స్ పరిధిలోని 450 మంది శానిటేషన్ సిబ్బందికి పలు రకాల వైద్య విభాగాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రభుత్వం అందజేసిన కిట్స్ లను తప్పక సవినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య స్టాల్స్ లలో కంటి, పంటి, ఆర్థో, టి. బి, లేప్రసి, బి.పి, షుగర్, గైనిక్, బెస్ట్ క్యాన్సర్ వంటి టెస్టులు శానిటేషన్ వర్కర్లకు వైద్యులు చేపట్టి వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, టీబీ నివారణ అధికారి చల్లా దేవి, అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ లు డాక్టర్ విజయనిర్మల, డాక్టర్ మురళీధర్, లెప్రసీ అధికారి డాక్టర్ రాధా కిషన్, తహసిల్దార్ అనిత రెడ్డి, వివిధ విభాగాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story