కల్తీ కల్లు బాధితుల హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు వెల్లడించిన నిమ్స్, గాంధీ

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ అప్డేట్ అధికారులు విడుదల చేశారు.

కల్తీ కల్లు బాధితుల హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు వెల్లడించిన నిమ్స్, గాంధీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ అప్డేట్ అధికారులు విడుదల చేశారు. నగరంలోని గాంధీ, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న భాదితుల శుక్రవారం (Health Bulletin) హెల్త్ బులిటెన్‌‌లో కీలక విషయాలను వెల్లడించారు. (NIMS Hospital) నిమ్స్ వైద్యుల హెల్త్ బులిటెన్ ప్రకారం.. చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 34 మంది నిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. ఇందులో భాగంగా కిడ్నీల్లో సమస్య ఉన్న 9 మందికి డయాలసిస్‌పై ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 12 మంది నిరంతరం పర్యవేక్షణ లో ఉన్నారని పేర్కొన్నారు.

అలాగే గాంధీ హాస్పిటల్లో హెల్త్ అప్డేట్ ప్రకారం.. ప్రస్తుతం 15 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇందులో 13 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరికి కిడ్నీల్లో సమస్య ఉందని, వారికి డయాలసిస్ (సీఆర్ఆర్‌టీ) చేస్తున్నారని వెల్లడించారు. కాగా, కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్నటికే 8 మంది మృతి చెందగా గాంధీలో చికిత్స పొందుతున్న చాకలి పెద్ద గంగారాం (70) నిన్న అర్ధరాత్రి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9 కి చేరింది. గాంధీ, నిమ్స్‌తో పాటు ఈఎస్ఐ, ప్రైవేటు ఆస్పత్రిలో మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. మొత్తంగా బాధితుల సంఖ్య 51 కి చేరింది.

Next Story