- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. పైలట్ ప్రాజెక్టు సక్సెస్‍తో ఇక రాష్ట్రమంతటా
ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగుల వేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు మరింత నాణ్యతతో మెరుగైన ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక అడుగులు వేస్తోంది. టెక్నాలజీతో కూడుకున్న హెల్త్ ఏటీఎంలను తీసుకురావాలని యోచిస్తోంది. హెల్త్ ఏటీఎంలు అని పిలిచే ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్‌లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతోంది. పైలట్ ప్రాతిపదికన పరీక్షించిన ఈ ప్రాజెక్టులో సానుకూల ఫలితాలను రావడంతో ఇక ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
132 టెస్టులు ఒకే చోట:
రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులో రోగ నిర్ధారణ సేవలను బలోపేతం చేసే ఉద్దేశంతో 2025 ఆగస్టులో కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, మలక్ పేట్ ఏరియా ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఇంటిగ్రేడెట్ వైద్య పరికరాలతో పని చేసే ఈ హెల్త్ ఏటీఎంలు రోగీ బాడీని స్కాన్ చేసి బీపీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, బరువు, ఎత్తు, బాడీ టెంపరేచర్ తో పాటు డెంగ్యూ, మలేరియా, యూరిన్, కొలెస్ట్రాల్, ఈసీజీ, షుగర్, హెచ్‌ఔడీ వంటి 132 పరీక్షలను ర్యాపిడ్ టెస్టుల రూపంలో వేగంగా పూర్తి చేస్తాయి. ఈ పరికరాలు రోగి డిజిటల్ హెల్త్ కార్డులను సిద్ధం చేసి వాటిని భద్రపరుస్తుంది. ఈ హెల్ట్ ఏటీఎంలలో పరీక్షలు చేయించుకున్న రోగుల నమూనాలను టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ప్రైవేట్ డయాక్నోస్టిక్ సెంటర్లకు సైతం పంపించారు. ఇక్కడ కూడా ఒకే రకమైన ఫలితాలు రావడంతో హెల్త్ ఏటీఎంల పనితీరు బాగుందనే అంచనాకు వచ్చిన అధికారులు వీటిని మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.






