- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్‌సీయూ భూ వివాదం.. రాష్ట్ర అటవీ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ సంచలన లేఖ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూ వ్యవహారం (Land Dispute) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు (High Court)లో కేసు సైతం నడుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర పర్యావరణ శాఖ (Central Environment Department) స్పందించింది. ఈ సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలి గ్రామంలో అక్రమంగా వృక్షాలను నరికివేయడం, తొలగించడం పై రాష్ట్ర అటవీ శాఖ (State Forest Department)కు లేఖ (Letter) రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలిగించారని, వన్యప్రాణులు, సరస్సులు, పురాతన రాతి నిర్మాణాలకు నష్టం కలిగించారని వివిధ వార్తా పత్రికల్లో కథనాలు వెలువడినట్లు పేర్కొంది.
పర్యావరణానికి విఘాతం కలిగించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక ఇకపై వివాదానికి తావు లేకుండా.. యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. అక్కడ చెట్లు, జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సలహా ఇచ్చింది. ఈ వ్యవహారంలో నిజా నిజాలపై విచారణ సాగించి, పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరింది. కోర్టులు, ట్రిబ్యునల్స్ గతంలో ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.






