అతి పెద్ద సైక్లింగ్ ఈవెంట్ HCL సైక్లోథాన్ హైదరాబాద్‌-2025 రికార్డు : ప్రారంభించిన గవర్నర్

by Ramesh Naini |

సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI) పర్యవేక్షణలో నిర్వహించిన HCL సైక్లోథాన్ హైదరాబాద్ 2025 రికార్డు స్థాయి హాజరుతో విజయవంతంగా ముగిసింది.

అతి పెద్ద సైక్లింగ్ ఈవెంట్ HCL సైక్లోథాన్ హైదరాబాద్‌-2025 రికార్డు : ప్రారంభించిన గవర్నర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశ సైక్లింగ్ చరిత్రలో మరో మైలురాయి నెలకొల్పుతూ, హెచ్సీఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI) పర్యవేక్షణలో నిర్వహించిన HCL సైక్లోథాన్ హైదరాబాద్ 2025 రికార్డు స్థాయి హాజరుతో విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా నుండి వచ్చిన 1,900 మందికి పైగా ప్రొఫెషనల్, అమెచ్యూర్ సైక్లిస్టులు, ఫిట్‌నెస్ ప్రియులు ఈ ప్రతిష్టాత్మక సైక్లింగ్ పోటీలో పాల్గొన్నారు. ఉస్మాన్ నగర్, వట్టినాగులపల్లి ప్రాంతంలోని ప్రైమ్ అరేనా నుంచి ప్రారంభమైన ఈ రేస్, నగరంలోని ఆధునిక దృశ్యాలు, పచ్చని పరిసరాలను దాటుతూ అదే ప్రదేశంలో ముగిసింది. “#ChangeYourGear” అనే థీమ్‌తో నిర్వహించిన ఈవెంట్ వ్యక్తిగత ఆరోగ్యం, ఫిట్‌నెస్, సస్టైనబుల్ లైఫ్‌స్టైల్‌పై దృష్టి పెట్టింది. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైక్లిస్టులు వివిధ విభాగాల్లో పోటీ పడి, మొత్తం రూ. 33.6 లక్షల బహుమతి నిధి కోసం తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇది భారతదేశంలో ఏ సైక్లింగ్ రేస్‌కీ లేని అత్యధిక బహుమతిగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. హెచ్సీఎల్ సైక్లోతాన్ వంటి కార్యక్రమాలు ఫిట్‌నెస్, సస్టైనబిలిటీ, కమ్యూనిటీ వెల్‌బీయింగ్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు. సైక్లింగ్ ఒక ఆరోగ్యవంతమైన, పచ్చని భారతదేశం వైపు పయనించే మార్గం అని వెల్లడించారు..హెచ్సీఎల్ గ్రూప్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ) సుందర్ మహాలింగం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో HCL సైక్లోతాన్ రెండవ ఎడిషన్ విజయవంతం కావడం గర్వకారణం అని, దేశవ్యాప్తంగా 16,000 మందికి పైగా రైడర్లను కలిపే కమ్యూనిటీగా ఇది ఎదిగిందన్నారు. సైక్లింగ్ కేవలం పోటీ మాత్రమే కాకుండా ఆరోగ్యం, పట్టుదల, సమాజంతో అనుబంధానికి చిహ్నం అని అన్నారు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మనిందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఎడిషన్ భారత్‌లో సైక్లింగ్ పెరుగుతున్న ప్రజాదరణకు స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. హెచ్సీఎల్ మద్దతుతో ప్రతిభావంతులను ప్రోత్సహించడం, ఫిట్‌నెస్, సస్టైనబిలిటీ సంస్కృతిని పెంపొందించడం జరుగుతోందన్నారు.

విజేతల వివరాలు..

Next Story