HCA కుంభకోణం కేసు.. చీఫ్ సెక్రటరీ దేవరాజ్‌కు రిమాండ్

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)లో జరిగిన అక్రమాల కేసులో A2గా ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ శుక్రవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

HCA కుంభకోణం కేసు.. చీఫ్ సెక్రటరీ దేవరాజ్‌కు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)లో జరిగిన అక్రమాల కేసులో A2గా ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ శుక్రవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే, పరారీలో ఉన్న ఆయనను గాలించేందుకు 6 ప్రత్యేక బృందాలను సీఐడీ అధికారులు ఏర్పాటు చేశారు. HCAలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రాగానే.. ఉప్పల్‌ సీఐ ఎలక్షన్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో సీఐడీ అధికారుల ట్రాప్ నుంచి దేవరాజు తప్పించుకున్నాడు. కేవలం 17 రోజుల్లోనే మొత్తం 7 రాష్ట్రాలు తిరిగిన దేవరాజును పోలీసుల శ్రమించి ఎట్టకేలకు పూణెలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Next Story