ముఖ్యమంత్రి ఇది చూశారా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన పోస్ట్

by Ramesh Goud |

ముఖ్యమంత్రి (Chief Minister) ఇది చూశారా.. రాజకీయాలు బంద్ చేసి విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి ఇది చూశారా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి (Chief Minister) ఇది చూశారా.. రాజకీయాలు బంద్ చేసి విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) ట్వీట్ (Tweet) చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లో విద్యార్థులు (Students) రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వీడియోలను (Videos) ట్విట్టర్ (Twitter) లో పోస్ట్ చేసిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేస్తున్న కార్యక్రమాలను విమర్శించారు.

దీనిపై ఆయన.. ముఖ్యమంత్రి ఏమో 11వేల కోట్లతో ప్రపంచ స్థాయి హైటెక్ సమీకృత గురుకులాలు అంటున్నారని, మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే అన్నంలో పురుగులు (Insects), బ్లేడ్లు (Blades) వస్తున్నాయని ఉస్మానియా విద్యార్థులు ప్రస్తుతం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు అని దుయ్యబట్టారు. అలాగే రాజకీయాలు బంద్ చేసి, కమీషన్ల కోసం.. ప్రత్యేక సమీక్షలు ప్రెస్ మీట్లు కాకుండా, రాష్ట్ర భవిష్యత్ ను కాపాడే విద్యార్థుల చదువు, ఆరోగ్యం గురించి ఆలోచించాలని ఆర్ఎస్పీ (RSP) సూచించారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత లోపిస్తోందని విద్యార్థులు రొడ్డెక్కారు. న్యూ గోదావరి హాస్టల్ (New Godavari Hostel) లో ఓ విద్యార్థి భోజనం చేస్తుండగా.. బ్లేడ్ కనిపించింది. ఆ బ్లేడ్ నోట్లోకి వెళితే పరిస్థితి ఏంటని విద్యార్థులు వాపోతున్నారు. అంతేగాక దీనిపై వీసీ (VC) సహా హాస్టల్ వార్డెన్ (OU Hostel Warden) వెంటనే స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ (Demand) చేస్తున్నారు.

Next Story