- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా హర్పాల్ సింగ్.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ (Lieutenant General Harpal Singh) (రిటైర్డ్)ను నియమిస్తూ ఇవాళ సీఎస్ రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు హర్పాల్ సింగ్ ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న నీటిపారుదల సొరంగ ప్రాజెక్టులలో సమస్యలను పరిష్కరించడం, పనులను వేగవంతం చేయడంతో పాటు ఆయన నైపుణ్యాన్ని, సేవలను నీటి పారుదల, సీఏడీ (CDA) విభాగంలో వినియోగించుకోనున్నారు. కాగా, జనరల్ హర్పాల్ సింగ్ భారత సైన్యంలో 40 ఏళ్లకు పైగా పని చేశారు. భారత రక్షణ దళాల వ్యూహాత్మక మౌలిక సదుపాయాలలో ఆయన నిష్ణాతుడు. పెద్ద ఎత్తున సివిల్ మౌలిక సదుపాయ ప్రాజెక్టులను మార్గదర్శనం చేయడం, అధునాతన సాంకేతికత, పరిష్కారాలను అమలు చేయడంలో హర్పాల్ సింగ్‌కు అపార అనుభవం ఉంది.
ఇక బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్‌గా, ఇండియన్ ఆర్మీలో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా, వ్యూహాత్మక సొరంగాలు, ఇతర భూగర్భ మౌలిక సదుపాయ ఆస్తుల అభివృద్ధిలో హర్పాల్ సింగ్ కీలకపాత్ర పోషించారు. రోహ్‌తాంగ్ పాస్ కింద అటల్ టన్నెల్ పూర్తి, సిక్కింలో థీంగ్ టన్నెల్, అరుణాచల్ ప్రదేశ్‌లో సెలా, నెచిఫు టన్నెల్స్ పురోగతి, దేశ సరిహద్దు పాస్‌ల వెంట అనేక సొరంగాల ప్రణాళికలో కీలక వ్యవహరించారు. అత్యంత సవాలుతో కూడిన హిమాలయ భౌగోళిక పరిస్థితుల్లో ఆయన సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ, అమెరికాలో పీజీ కోర్సులు చేసి మౌలిక సదుపాయ అభివృద్ధిలో నైపుణ్యం సంపాదించారు. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) వైస్ చైర్మన్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిడ్జ్ ఇంజనీర్స్ సంస్థకు వైస్ చైర్మన్, కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.






