కాపీ పేస్ట్ ప్రభుత్వం.. కేంద్రంపై Minister Harish Raoఫైర్

by Disha Web Desk 4 |
కాపీ పేస్ట్ ప్రభుత్వం.. కేంద్రంపై Minister Harish Raoఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వైపు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూనే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కాపీ పేస్ట్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. సిద్దిపేట నియోజకవర్గం నాడు ఉద్యమంలో ఆదర్శంగా నిలవడంతో పాటు నేడు అభివృద్ధిలోనూ ఆదర్శంగా ఉందన్నారు. ఇది ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారంతోనే సాధ్యమైందని చెప్పారు. సిద్ధిపేట అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఒకటి తర్వాత మరొకటి మారాయి తప్ప ప్రజల బతుకులు మారలేదని విమర్శించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీర పథకం క్రింద ఇంటింటికీ తాగునీరు అందిస్తే దాన్ని హర్ ఘర్ బల్ పేరిన కేంద్రం కాపీ కొట్టిందన్నారు. మిషన్ భగీరథ తరహాలో అమృత్ సరోవర్, రైతు బంధు తరహాలో పీఎం కిసాన్ యోజన వంటి పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రూ.35 వేల కోట్లు ఆశచూపినా కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదన్నారు. దేశంలో 26 శాతం నిరుద్యోగత ఉన్నదని యేటా లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న బీ్జేపీ ఘోరంగా విఫలం చెందిందన్నారు. ఎనిమిదేళ్లలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని మండిపడ్డారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నదని మండిపడ్డారు. ఉచితాలు బంద్ చేయాలని కేంద్రం మెలిక పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రజకులకు పెద్ద ఎత్తున రుణాలు

రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని మంత్రి హారీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఐలమ్మ పోరాట స్పూర్తిని పుణికిపుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని, కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

Next Story

Most Viewed